MDK: టేక్మాల్‌లో నెలకొన్న విద్యుత్ సమస్యల పరిష్కారానికి ఏఈ ఉదయ్ భాస్కర్, సర్పంచ్ తిమ్మిగారి సుధాకర్ కలిసి మంగళవారం ‘స్పెషల్ డ్రైవ్’ నిర్వహించారు. గ్రామంలోని పలు కాలనీల్లో పర్యటించి వంగిపోయిన, పాత విద్యుత్ స్తంభాలను పరిశీలించారు. అవసరమైన చోట కొత్త స్తంభాలను ఏర్పాటు చేసి సమస్యలను త్వరగా పరిష్కరిస్తామని వారు ప్రజలకు హామీ ఇచ్చారు.