PDPL: ధర్మారం మండలం కానపల్లిలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి విద్యుత్ అధికారులు మంగళవారం ‘ప్రజా బాట’ కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ కాల్వ సుగుణ, ఉప సర్పంచ్ యమున, వార్డు సభ్యుల ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో విద్యుత్ సమస్యలను అధికారులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ సతీష్, ఏఈ మహిపాల్ రెడ్డి, ఎస్ఈ దిలీప్ రెడ్డి, విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.