KNR: నా పిల్లలు శిశు మందిర్ పాఠశాలల్లో చదువుకోకపోవడం దురదృష్టకరమని కేంద్రమంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. కరీంనగర్ శ్రీ సరస్వతి విద్యామందిరంలో ‘ఖేల్ కూద్’ క్రీడా పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. కేవలం విద్యే కాకుండా, విద్యార్థులకు భారతీయ సంస్కృతి, సంస్కారాలను నేర్పించడమే ధ్యేయంగా ఈ సంస్థలు పని చేస్తున్నాయని ఆయన కొనియాడారు.