కృష్ణా: తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం తేలప్రోలులో నిరసన చేపట్టారు. రిటైర్మెంట్ వయస్సును 62 ఏళ్లకు పెంచాలని, జీవో నెం. 36ను తక్షణమే అమలు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. 2019 తర్వాత చేరిన వారిని క్రమబద్ధీకరించాలని, గ్రాట్యుటీ చట్టం అమలు చేయాలని నినదించారు.