మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడిల ‘మన శంకరవరప్రసాద్ గారు’ మూవీ జనవరి 12న విడుదలవుతుంది. ఇప్పటికే కొన్ని చోట్ల ఈ సినిమా టికెట్ బుకింగ్స్ ఓపెన్ అవ్వగా.. హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. తాజాగా అమలాపురంలోని వెంకటరమణ థియేటర్లో ఈ మూవీ టికెట్ వేలం వేయగా.. మెగా అభిమాని వెంకట సుబ్బారావు రూ.1.11 లక్షలకు దక్కించుకున్నాడు.