నేపాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓ మసీదు ధ్వంసం ఘటనతో అక్కడ భారీ ఎత్తున ఆందోళనలు చెలరేగాయి. నిరసనకారులు రోడ్లపైకి రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో ముందుజాగ్రత్త చర్యగా భారత్-నేపాల్ సరిహద్దును అధికారులు మూసివేశారు. రాకపోకలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. సరిహద్దు వద్ద భారీగా భద్రతా బలగాలను మోహరించారు.