E.G: గోకవరంలో నూతనంగా నిర్మిస్తున్న సూర్య దేవాలయ, అన్నదాన షెడ్డు నిర్మాణాల నిమిత్తం విశ్వ హిందూధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు, బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు లక్ష రూపాయల చెక్కును మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు తోట సాయిబాబా మాట్లాడుతూ.. దేవాలయం నిర్మాణానికి భక్తుల స్వచ్ఛందంగా ముందుకు రావాలన్నారు.