MDCL: చిల్కానగర్ డివిజన్ బీరప్ప గడ్డ ప్రాంతంలో సుమారు రూ. 95 లక్షలతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను బన్నాల ప్రవీణ్ ముదిరాజ్ స్థానికులతో కలిసి పర్యవేక్షించారు. కాంట్రాక్టర్ ఆలస్యం చేస్తున్నాడని తెలుసుకుని, ఫోన్లో మాట్లాడి పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. సంక్రాంతి లోపు రోడ్డు, డ్రైనేజీ పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.