W.G: ఉండి మండలం చెరుకువాడ శివారులోని పేకాట స్థావరంపై దాడి చేసి నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు SI నసీరుల్లా సోమవారం తెలిపారు. వారి నుంచి రూ.7,050 నగదు, పేకముక్కలు స్వాధీనం చేసుకున్నారు. సంక్రాంతి సందర్భంగా జూదాన్ని ప్రోత్సహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు. పండుగ పూట కేవలం సాంస్కృతిక కార్యక్రమాలే నిర్వహించాలని సూచించారు.