KMM: రానున్న ఎన్నికల్లో నామినేటెడ్ పోస్టుల కేటాయింపులో ముస్లిం మైనార్టీలకు సరైన ప్రాతినిధ్యం కల్పించాలని ఖమ్మం నగర కాంగ్రెస్ పార్టీ మైనార్టీ అధ్యక్షులు అబ్బాస్ కోరారు. బుధవారం జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణను కలిసి వినతి పత్రం అందించారు. ముస్లిం మైనార్టీలకు జనాభా దామాషా ప్రకారం రాజకీయాల్లో పదవుల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు.