KKD: తల్లి మందలించిందన్న మనస్తాపంతో ఓ బాలుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉప్పలంక మొండి గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై సునీత తెలిపిన వివరాల ప్రకారం.. సంగాని సూరిబాబు ఫ్యామిలీ హైదరాబాద్ వెళ్తుండగా తనను మందలించిందని మనస్తాపానికి గురైన కుమారుడు సింహాద్రి (16) సోమవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ప్రాణాలు విడిచాడు.