MNCL: జన్నారం మండలంలోని ప్రధాన రహదారిపై వేగ నియంత్రణ అతి ముఖ్యమని జన్నారం ఎఫ్డీవో రామ్మోహన్ సూచించారు. ఆయన మాట్లాడుతూ.. జన్నారంలో కవ్వాల్ అభయారణ్యం ఎక్కువగా ఉందని, దీంతో వన్యప్రాణుల సంచారం కూడా ఉంటుందన్నారు. కోతులు, జింకలు, తదితర వన్యప్రాణులు ఎక్కువగా సంచరిస్తాయన్నారు. ప్రధాన రోడ్డుపై అవసరమైన చోట్ల స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేశామన్నారు.