కృష్ణా: జిల్లాలో కోడి పందేలు నిర్వహించడం చట్టరీత్యా నేరమని, ఎక్కడైనా జరిగితే కఠిన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేయాలని కలెక్టర్ డీ.కే.బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో కలెక్టర్ ఛాంబర్లో ఎస్పీసీఏ సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. అనంతరం కోడిపందేల నిషేధంపై రూపొందించిన కరపత్రాలను కలెక్టర్ ఆవిష్కరించారు.