KKD: పిఠాపురం పాడా కార్యాలయంలో సోమవారం PGRS నిర్వహిస్తున్నట్లు పాడా పీడీ శ్రీనివాసరావు ఆదివారం తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు అర్జీదారుల నుంచి వినతులు స్వీకరిస్తామన్నారు. నియోజకవర్గ, గ్రామ స్థాయి అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని పేర్కొన్నారు. ప్రజలు ఆన్లైన్ ద్వారా కూడా తమ సమస్యలపై అర్జీలు సమర్పించవచ్చని ఆయన సూచించారు.