కోనసీమ: జిల్లా వైసీపీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి కాపులకి, ఎస్సీలకు మధ్య కుల వైశమ్యాలు రెచ్చగొట్టాలని చూస్తున్నారని మందపల్లికి చెందిన TDP సీనియర్ నాయకులు ధరణాల రామకృష్ణ ఆరోపించారు. రావులపాలెంలో శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని అవమానించారన్నారు. ఈ మేరకు జగ్గిరెడ్డిపై చర్య తీసుకోవాలని ఆదివారం కొత్తపేట పోలీస్స్టేషన్లో నాయకులు వినతిపత్రం అందజేశారు.