రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు మారుతి కాంబోలో తెరకెక్కిన ‘రాజాసాబ్’ మూవీ జనవరి 9న విడుదలవుతుంది. తాజాగా ఈ సినిమాపై సాలిడ్ న్యూస్ బయటకొచ్చింది. జనవరి 8న ఈ చిత్రం ప్రీమియర్ షోలు వేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ముఖ్యంగా APలో భారీగా ప్రీమియర్స్కు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ స్పెషల్ షోలకు టికెట్ ధర రూ.800 వరకు ఉండే అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.