MLG: ఈనెల 28వ తేదీ నుండి మేడారం మహాజాతర ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వరంగల్ బల్దియా నుంచి 550 మంది పారిశుద్ధ కార్మికులను మేడారంకు పంపిస్తున్నట్లు అధికారులు తెలిపారు. గత జాతరలో మాదిరిగా ఈసారి కూడా మేడారం జాతరలోని అన్ని సెక్టార్లలో ప్రభుత్వ ఆదేశాలమేరకు పారిశుద్ధ్య నిర్వహణకు సిబ్బంది తరలి వెళ్తారన్నారు.