Drugs : ఢిల్లీ విమానాశ్రయంలో రూ.21కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత
ఢిల్లీ(Delhi)లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం(Delhi International Airport)లో రూ.21కోట్లు విలువ చేసే మూడు కేజీల హెరాయిన్(Heroin)ను కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. కెన్యా(Kenya) నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద భారీ మొత్తంలో ఈ హెరాయిన్ ను గుర్తించారు అధికారులు.
Drugs : దేశంలోని విమానాశ్రయాలు అక్రమ రవాణాకు అడ్డాగా మారుతున్నాయి. బంగారం(gold), డ్రగ్స్(Drugs) లాంటివి భారీగా స్మగ్లింగ్ చేస్తున్నారు కేటుగాళ్లు. కస్టమ్స్ అధికారుల ఎంత నిఘా పెట్టినా స్మగ్లింగ్ కు అడ్డుకట్టపడడం లేదు. తాజాగా దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం(Delhi International Airport)లో రూ.21కోట్లు విలువ చేసే మూడు కేజీల హెరాయిన్(Heroin)ను కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. కెన్యా(Kenya) నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద భారీ మొత్తంలో ఈ హెరాయిన్ ను గుర్తించారు అధికారులు. హెరాయిన్ ను ట్రాలీ బ్యాగ్ కింది భాగం లో దాచి తరలించేందుకు కేటుగాడు ప్రయత్నించాడు. పోలీస్ ట్రైన్ డాగ్(Dog) డ్రగ్స్ వాసన పసిగట్టి.. డ్రగ్స్ అక్రమ రవాణా గుట్టును రట్టు చేసింది. అధికారులు ప్రయాణికుడిని అరెస్ట్ చేసి NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గతంలో కూడా ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ ఎత్తున డ్రగ్స్‌ను పట్టుకున్నారు. ఆఫ్రికా నుంచి వస్తున్న ప్రయాణికురాలి వద్ద దాదాపు 15 కోట్ల 36 లక్షల విలువ చేసే కిలో కొకైన్(Cocine)ను కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. క్యాప్యూల్స్‌లో నింపిన కొకైన్‌ను కిలాడీ లేడీ మింగేయడంతో అనుమానం వచ్చిన అధికారులు తనిఖీలు చేశారు. పొట్టలో దాచిన కొకైన్‌ను బయటకు తీసేందుకు అధికారులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. శస్త్ర చికిత్స అనంతరం పొట్టలో ఉన్న 82 క్యాప్యూల్స్(Capules)ను వైద్యులు బయటకు తీశారు.