మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాల నుంచి బ్రేక్ తీసుకుంటున్నాడు. దాదాపు రెండు నెలల పాటు...ఆయన షూటింగ్స్ లాంటివి ఏమీ లేకుండా...ఉండాలని భావిస్తున్నారట. అది కూడా కేవలం తన భార్య ఉపాసన, పుట్టబోయే బిడ్డ తో గడపడం కోసమేనట.
రామ్ చరణ్ (Ramcharan)కు పెళ్లైన పదేళ్ల తర్వాత తండ్రి కాబోతున్నారు. ఈ వార్త ఆయన కుటుంబంలో మాత్రమే కాదు మెగా అభిమాను(Mega Fans)ల్లోనూ ఆనందం నింపింది. ఎప్పుడెప్పుడు మెగా వారసుడు పుడతాడా అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఉపాసనకు దాదాపు నెలలు నిండాయి. మరో నెలలో బిడ్డ పుట్టే అవకాశం ఉంది. దీంతో చరణ్ ఈ సమయంలో తన భార్య బిడ్డకు ఎక్కువ సమయం కేటాయించాలని భావిస్తున్నారట. అందుకే షూటింగ్స్ అన్నింటినీ పక్కన పెట్టి లాంగ్ లీవ్ తీసుకోవాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దాదాపు 2 నెలలు ఆయన షూటింగ్ కి దూరంగా ఉండాలి అని అనుకుంటున్నారట.
ఇదిలా ఉండగా.. ప్రస్తుతం చరణ్(Ram Charan) ..శంకర్(shankar) దర్శకత్వంలో గేమ్ చేంజర్(Game Changer)లో నటిస్తున్నాడు. ఈ మూవీలో రామ్ చరణ్ కి జోడీగా బాలీవుడ్(Bollywood) బ్యూటీ కియారా అద్వాణి(Kiyara Adwani) నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మొదలైంది. మరోవైపు రామ్ చరణ్ 16వ సినిమా కూడా త్వరలోనే సెట్స్ కి వెళ్లాల్సి ఉంది. ఈ సినిమాని ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు(Buchibabu) దర్శకత్వం వహిస్తున్నారు.