బ్రెజిల్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇసుక లోడ్‌తో వెళ్తున్న ట్రక్కును బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 11 మంది అక్కడికక్కడే మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడగా.. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.