కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. తీవ్రమైన దగ్గు కారణంగా ఆమెను ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె సీనియర్ పల్మనాలజిస్ట్ పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. గత కొంతకాలంగా సోనియా శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఆమె త్వరగా కోలుకోవాలని పార్టీ శ్రేణులు ఆకాంక్షిస్తున్నాయి.