తాను విధించిన టారిఫ్లను సమర్థిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పోస్ట్ పెట్టారు. సుంకాల విషయంలో తాను అనుసరిస్తోన్న విధానాలు దేశాన్ని ఆర్థికంగా, భద్రతాపరంగా మరింత దృఢంగా మార్చాయని అన్నారు. ఈ విషయాన్ని దేశంపై గౌరవం లేని కొన్ని మీడియా సంస్థలు తెలిపేందుకు నిరాకరిస్తున్నాయని వెల్లడించారు. త్వరలోనే USకు 600 బిలియన్ డాలర్ల(దాదాపు రూ.54 లక్షల కోట్లు) ఆదాయం సమకూరనుందని అన్నారు.