HYD: ఖాజాగూడలో ఐటీ హబ్‌కు సమీపంలో ఉన్న ఖాజాగూడ పెద్ద చెరువు FTL పరిధిలో సుమారు 1000 గజాల భూమిని కబ్జా చేసినట్లు హైడ్రా ప్రజావాణికి ఫిర్యాదు అందింది. ఆ భూమిని 250 గజాల చొప్పున 4 ఫ్లాట్లుగా విభజించి, ఇంటి నంబర్లు కూడా తీసుకున్నారని ఆరోపించారు. హైడ్రా వెంటనే చర్యలు తీసుకుని ఖాజాగూడ చెరువు FTL పరిధిని రక్షించాలని స్థానికులు కోరారు.