మధ్యప్రదేశ్ పోలీస్ శాఖలో క్రికెటర్ క్రాంతి గౌడ్ తండ్రి మున్నాసింగ్ గౌడ్ తిరిగి నియమితులయ్యారు. ప్రపంచకప్ గెలిచిన అనంతరం, తన తండ్రికి మళ్లీ ఉద్యోగం ఇవ్వాలని క్రాంతి సీఎం మోహన్ యాదవ్‌ను కోరారు. నాడు సానుకూలంగా స్పందించిన సీఎం.. తాజాగా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. మున్నాసింగ్‌ను విధుల్లోకి తీసుకుంటూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో క్రాంతి కుటుంబంలో ఆనందం నెలకొంది.