MDCL: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అల్వాల్ వెన్‌రాగ్ ఎన్‌క్లేవ్‌లో 200 ఏళ్ల చరిత్ర కలిగిన చింతబాయి ఓపెన్ బావిని కొందరు కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని స్థానికులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. లే ఔట్లో ఓపెన్ స్పేస్‌గా చూపిన ఈ బావి గతంలో అనేక మందికి తాగునీరు అందించిందని, చారిత్రక వారసత్వాన్ని కాపాడాలని వినతిపత్రం అందజేశారు.