KMR: పంచముఖి హనుమాన్ కాలనీ నుంచి పాత బస్టాండ్ వెళ్లే దారిలో మంగళవారం ఉదయం ప్రమాదం చోటుచేసుకుంది. ఒక ట్రాక్టర్ వేగంగా వస్తూ.. అదుపుతప్పి డివైడర్ను ఎక్కడంతో ట్రాలీ బోల్తా పడింది. డ్రైవర్ అజాగ్రత్తే దీనికి కారణమని తెలుస్తోంది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.