ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కాంబోలో మూవీ రాబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమాలో బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ భాగమైనట్లు వార్తలొస్తున్నాయి. ఈ మూవీ ఫ్లాష్‌బ్యాక్‌లో అతను కనిపించనున్నట్లు సమాచారం. కాగా, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.