KDP: కమలాపురం మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికులు కనీస రక్షణ పరికరాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. గ్లాజులు, బూట్లు, మాస్కులు లేకపోవడంతో అనారోగ్యం పాలవుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి రక్షణ పరికరాలు, రేడియం జాకెట్లు అందించి, నెలనెలా జీతాలు సకాలంలో చెల్లించాలని కోరారు.