TG: రాష్ట్రంలో కాలుష్యం తగ్గాలంటే ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగాలని BJP MLA వెంకట రమణారెడ్డి అన్నారు. EVలపై కేంద్రం సబ్సిడీ ఇస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇస్తోందా.. అని ప్రశ్నించారు. ఛార్జింగ్ స్టేషన్లు లేక గ్రామాల్లో ఈవీలను తక్కువగా వాడుతున్నారని చెప్పారు. మంత్రులు, MLAలు, MLCలు, అధికారులు EVలు వాడాలని, ప్రభుత్వం ఆ దిశగా కృషి చేయాలని పేర్కొన్నారు.