దాదాపు 144 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ అరుదైన రికార్డ్ సాధించాడు. తాజాగా అతడు ఇంగ్లండ్‌పై చేసిన సెంచరీ యాషెస్‌లో 13వది. తద్వారా ఈ టోర్నీ చరిత్రలో అత్యధిక సెంచరీలు చేసిన రెండో ఆటగాడిగా జాక్ హాబ్స్(12) రికార్డును అధిగమించాడు. ఆసీస్ లెజెండ్ బ్రాడ్‌మాన్ (19) తొలి స్థానంలో ఉన్నాడు.