TG: సింగరేణి కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. 75 రోజుల్లో గోదావరిఖనలో క్యాత్ లాబ్ ప్రారంభిస్తామని చెప్పారు. 32 మంది వైద్యుల కోసం నోటిఫికేషన్ ఇచ్చామని, త్వరలో భర్తీ చేస్తామన్నారు. 176 మంది పారామెడికల్ సిబ్బంది నియామానికి ప్రక్రియ జరుగుతోందన్నారు. సింగరేణి ఆస్పత్తుల్లో మార్చి నాటికి ఖాళీలు భర్తీ చేస్తామన్నారు.