ATP: తాడిపత్రి మండల పరిధిలోని ఆలూరు గ్రామంలో ఆదివారం రూరల్ పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. తాడిపత్రి రూరల్ సీఐ శివగంగాధర్ రెడ్డి నేతృత్వంలో ఎస్సై కాటయ్య, సిబ్బంది కలిసి గ్రామంలోని పలు ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.