»Indian Railways Changed The Rules For Sleeping In Ac And Sleeper Coaches
Railways : రైలు మిడిల్ బెర్తులో పొద్దెక్కే వరకు పడుకుంటే ఇక జరిమానాయే!
ప్రయాణికులు రైళ్లలో మరింత సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు వీలుగా భారతీయ రైల్వే శాఖ ఎప్పటికప్పుడు కొత్త నిబంధనలను తీసుకొస్తూ ఉంటుంది. కొత్తగా వచ్చిన ఓ నిబంధన ప్రకారం ఇప్పుడు మిడిల్ బెర్తుల్లో ఉదయం ఆరు దాటాక పడుకుంటే జరిమానా పడే అవకాశాలుంటాయి.
Indian Railways : మన దేశంలో అతి పెద్ద రవాణా వ్యవస్థ ఏదంటే భారతీయ రైల్వేలని(Indian Railways) ఎవ్వరైనా చెప్పేస్తారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఈ శాఖ ఎప్పటికప్పుడు కొత్త కొత్త నిబంధనలను తీసుకొస్తూ ఉంటుంది. గతంలో రైళ్లలో మిడిల్ బెర్తును తెరిచి పెట్టుకోవడానికి రాత్రి తొమ్మిది గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు సమయం కేటాయించింది. దాన్ని ఇప్పుడు రాత్రి పది గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు మార్చింది.
నిర్దేశించిన సమయం కంటే ముందు మిడిల్ బెర్తును( ṁiddle berth) వాడుకున్నా, ఉదయం ఆరింటి తర్వాత ఇంకా అందులోనే పడుకుని ఉన్నా జరిమానా విధించే అధికారం రైల్వే శాఖకు ఉంటుంది. కాబట్టి పొద్దెక్కే వరకు మిడిల్ బెర్తులో పడుకోవాలనుకుంటే కష్టమే. వాస్తవానికి ఇలా మిడిల్ బెర్తును తెరిచి పెట్టడం వల్ల కూర్చోవాలని అనుకునే మిగిలిన ప్రయాణికులుకు ఇబ్బందులు తలెత్తుతాయి. ఈ విషయంలో కొన్ని సార్లు వాగ్వాదాలు జరుగుతుంటాయి.
ఇలాంటి విషయాలను అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని రైల్వే శాఖ ఈ కొత్త నిబంధనను తీసుకొచ్చింది. గతంలో రైలులో నిద్ర సమయం తొమ్మిది గంటలుగా ఉండేది. దాన్ని ఇప్పుడు ఎనిమిది గంటలకు కుదించింది. దీంతో ప్రస్తుతం రాత్రి పది నుంచి ఉదయం ఆరు గంటల వరకు మాత్రమే నిద్ర పోవడానికి వీలు ఉంటుంది. ఏసీ, స్లీపర్ క్లాస్ కోచ్‌ల్లో(AC And Sleeper Coaches) ఈ నిబంధన తాజాగా అమల్లోకి వచ్చింది.