NLR: కావలి రూరల్ మండలం ఆనేమడుగు పంచాయతీ మసీదు కాలనీలో సైడ్ కాలువలో మురుగు, చెత్త పేరుకుపోవడంతో దుర్వాసన వెదజల్లుతూ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలువురు ఈ సమస్యను ఎమ్మెల్యేకు తెలియజేశారు. ఈ సమస్యపై ఆయన విజ్ఞప్తితో, ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆదేశాల మేరకు ఇవాళ సైడ్ కాలువ పూడికతీయడం, జేసీబీ సహాయంతో పరిశుభ్రత చేశారు.