జగిత్యాల రూరల్ మండలం అనంతారం రెండవ అంగన్వాడి సెంటర్లో సూపర్వైజర్ శ్రీలక్ష్మి పోషణ మాసోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పోషణ మాసంలో భాగంగా తల్లులకు అన్ని విషయాల్లో అవగాహన కల్పించారు. బాలామృతం ఎలా తినిపించాలి. బాలింతలు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, అనే విషయాలపై పూర్తి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ శ్రీలక్ష్మి, అంగన్వాడి టీచర్లు పాల్గొన్నారు.