HYD: హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా 36 మసాలా తయారీ కేంద్రాల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పలు కంపెనీలు నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. మసాలాల్లో ఎలకల వ్యర్థాలు, అస్వచ్ఛత ఉన్నట్లు తేలింది. ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలు పాటించకపోవడంతో పలువురు తయారీదారులకు నోటీసులు జారీ చేశారు.