NLR: అల్లూరు మండలంలోని నార్త్ మోపూరు అంగన్వాడి కేంద్రంలో ఇవాళ పౌష్టికాహారం పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సూపర్వైజర్ పద్మావతి మాట్లాడుతూ.. మంచి పోషక విలువలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలన్నారు. పరిసరాల పరిశుభ్రత, పోషక విలువలు, మంచి ఆరోగ్యం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర విషయాలను వివరించారు.