W.G: తణుకులో ఒక ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన రాయితీ గ్యాస్ సిలిండర్లను ఇవాళ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 19వ వార్డులో నివాసం ఉంటున్న అరవ సూర్య ఉదయభాస్కరరావు ఇంట్లో అక్రమంగా నిలవ ఉంచినట్లు వచ్చిన సమాచారంతో తణుకు ఫైర్ ఆఫీసర్ అజయ్ కుమార్తో పాటు రెవెన్యూ, పోలీసు సిబ్బంది దాడి చేసి 33 గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు.