KRNL: దేవనకొండ మండల కేంద్రంలో ఇవాళ రజక సంఘం నాయకులు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. 2024 ఎన్నికల్లో రజకులను ఎస్సీ జాబితాలో చేర్చుతామని అప్పుడు చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును వారు కోరారు. రజకుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని వారు అన్నారు.