పెట్టుబడుల్లో వెండి దూసుకుపోతోంది. బంగారం ధరలు పెరుగుతున్నప్పటికీ, గత ఐదేళ్లలో గోల్డ్ కంటే సిల్వరే ఎక్కువ లాభాలను ఇచ్చింది. గత ఐదేళ్లలో బంగారంపై 33.15% రాబడి రాగా, వెండిపై అధికంగా 37.23% లాభాలు వచ్చాయి. అదే కాలంలో సెన్సెక్స్ కేవలం 2.64% మాత్రమే రిటర్న్స్ ఇచ్చిందని నిపుణులు చెబుతున్నారు. అందువల్ల, దీర్ఘకాలిక పెట్టుబడులకు వెండి బెస్ట్ చాయిస్ అని సూచిస్తున్నారు.