కృష్ణా: పొట్టిపాడు గ్రామంలోని ఉషారామా ఇంజనీరింగ్ కాలేజ్ NSS యూనిట్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ అవగాహన ర్యాలీని మంగళవారం నిర్వహించారు. ఈ క్రమంలో విద్యార్థులు ఇంటింటికి వెళ్లి, ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే ప్రమాదాల గురించి ప్రజలకు వివరించారు. ప్లాస్టిక్ సంచులు, బాటిళ్లు, గ్లాసులు వంటి వస్తువులు వాడకాన్ని తగ్గించాలని వాటి స్థానంలో జ్యూట్ వస్త్రాలను వాడాలని సూచించారు.