KMR: జిల్లాలోని ప్రతి నియోజకవర్గం, మున్సిపాలిటీ, వార్డులు సందర్శించి అట్టడుగు స్థాయి కార్యకర్తలతో సంప్రదించిన తర్వాతే కొత్త నాయకులను నియమిస్తారని ఏఐసీసీ పరిశీలకుడు రాజ్‌పాల్ కరోలా స్పష్టం చేశారు. మంగళవారం డీసీసీ అధ్యక్షుడి ఎన్నిక కోసం పట్టణంలోని ఆర్అండ్బీ గెస్ట్ హౌస్‌లో కామారెడ్డి నియోజకవర్గ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు.