పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై ఏపీ సర్కార్ జారీ చేసిన కొత్త టెండర్ నోటిఫికేషన్‌పై TG ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ టెండర్‌ను తక్షణమే రద్దు చేయాలని, సర్వే పనులను నిలిపివేయాలని కోరుతూ కేంద్ర జల సంఘం(CWC)కి లేఖ రాసింది. పోలవరం ప్రాజెక్టు DPRకు విరుద్ధంగా ఈ లింక్ ప్రాజెక్టు ఉందని, ఈ ప్రాజెక్టును ఆమోదించవద్దని CWCకి విజ్ఞప్తి చేసింది.