sleeping tips : నిద్ర లేమి అనేది ఇటీవల కాలంలో పెద్ద సమస్యగా మారిపోయింది. వయసుతో సంబంధం లేకుండా అందరినీ వేదిస్తోంది. ఇలా సరిగ్గా నిద్ర( sleep) పట్టకపోవడం వల్ల దీర్ఘ కాలంలో మనకు వచ్చే అనారోగ్య సమస్యలు అన్నీ ఇన్నీ కావు. అందుకనే మెరుగైన నిద్ర కోసం కాస్త ప్లాన్ చేసుకోవాల్సిందే. చిన్న చిన్న టిప్స్(tips) పాటించాల్సిందే. అవే ఇక్కడున్నాయి. చదివేయండి.
మధ్యాహ్నం పూట చాలా మంది ఒకటి, రెండు సార్లు కునుకులు(naps) వేస్తుంటారు. అలాంటి నేప్స్ని తగ్గించుకోవాలి. ఇవి రాత్రి నిద్రకు ప్రతిబంధకంగా మారతాయి. కాబట్టి అలాంటి అలవాటు ఉంటే నెమ్మదిగా మార్చుకోవాలి. అలాగే పడుకోవడానికి సౌకర్యవంతమైన పరుపు, తలగడ ఉండేలా చూసుకోవాలి. సాయంత్రం నాలుగు గంటలు దాటిన తర్వాత టీ, కాఫీలను తాగకూడదు. కెఫీన్ ఉండే పదార్థాలకు దూరంగా ఉండాలి. ఒకసారి రాత్రి పది గంటలకు, ఒకసారి పన్నెండు గంటలకు అన్నట్లు నిద్ర పోకూడదు. సరిగ్గా స్లీప్ షెడ్యూల్ని మెయింటెన్ చేయాలి. ఒకే సమయానికి పడుకోవడం, ఒకే సమయానికి లేవడం అలవాటు చేసుకోవాలి.
ఎక్కువగా ఫోన్లు చూస్తూ గడిపేవారు బ్లూ లైట్ ఎక్స్పోజర్కు గురవుతారు. అంతే కాకుండా కాంతిని కళ్లు చూస్తూ ఉండటం వల్ల రాత్రైన సంగతిని మన శరీరం గుర్తించలేదు. దీంతో తదనుగుణంగా మనలో నిద్ర హార్మోన్లు విడుదల కావు. అందుకనే రాత్రి పూట పడుకునే వారుకు ప్రకాశవంతమైన లైట్ల మధ్య గడపకూడదు. పడుకోవడానికి కనీసం గంట ముందు నుంచే ఇంట్లో లైట్లను డిమ్ చేసుకోవాలి. ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్టాప్ల్లాంటి వాటిని అస్సలు చూడకూడదు. అలాగే ఒత్తిడులు ఏమైనా ఉంటే వాటిని బెడ్ వరకు తెచ్చుకోకూడదు. అలాంటి వాటిని పడుకునే ముందే పరిష్కరించుకుని నిద్రకు ఉపక్రమించాలి.