Garlic : పడుకునే ముందు ఓ వెల్లుల్లి రెబ్బ తింటే ఎన్ని ప్రయోజనాలో!
మనం దాదాపుగా చాలా కూరల్లో వెల్లుల్లిని వాడుతుంటాం. అయితే అలా కాకుండా రాత్రి పడుకునే ముందు ఓ వెల్లుల్లి రెబ్బను తిని చూడండి. ఆరోగ్యాన్ని అది అనేక రకాలుగా మెరుగుపరుస్తుంది. ఆ వివరాలే ఇక్కడున్నాయి. చదివేయండి.
Eating Garlic At Night Benefits : వెల్లుల్లి మన కూరలకు మంచి రుచిని యాడ్ చేస్తుంది. మసాలా కూరలు, నాన్ వెజ్ వంటల్లో అయితే ఇది లేనిదే మనకు కూర పూర్తి కాదు. అయితే అలా ఉడికించి తిన్న దాని కంటే రాత్రి పడుకునే ముందు దీన్ని పచ్చిగా తింటే చాలా ప్రయోజనాలు(BENEFITS) కలుగుతాయట. నిద్రకు ఉపక్రమించే ముందు ఒకటి లేదా రెండు వెల్లుల్లి(GARLIC) రెబ్బలను తినడం వల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం రండి.
ఇలా రోజూ రాత్రి పడుకునే ముందు వెల్లుల్లిని(GARLIC) తినే వారిని వైద్య నిపుణులు పరీక్షించారు. వారిలో జలుబు, ఫ్లూ లాంటి లక్షణాలు తక్కువగా కనిపించాయి. మిగిలిన వారితో పోలిస్తే వీరిలో రోగ నిరోధక శక్తీ పెరిగినట్లు గుర్తించారు. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు మనల్ని ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా చూస్తాయని వెల్లడించారు. అలాగే రాత్రి పూట దీన్ని తినడం వల్ల మనకు మంచిగా నిద్ర(Sleep) కూడా పడుతుందట. దీనిలో ట్రప్టోఫాన్ అనే అమీనో యాసిడ్ ఉంటుంది. ఇది నాణ్యమైన నిద్రకు అవసరమైన హార్మోన్ అయిన సెరెటోనిన్ని ఉత్పత్తి చేస్తుంది. ఫలితంగా అలసట తగ్గి చక్కగా నిద్ర పడుతుంది.
కొలస్ట్రాల్ సమస్యలతో ఇబ్బందులు పడే వారు రోజూ రాత్రి కచ్చితంగా రెండు వెల్లుల్లి(GARLIC) రెబ్బలు తినాలి. అందువల్ల మన శరీరంలో చెడు కొలస్ట్రాల్ తగ్గుతుంది. మంచి కొలస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. ఫలితంగా గుండె సైతం ఆరోగ్యంగా ఉంటుంది. గుండె పోటు, బీపీ ల్లాంటివీ రాకుండా ఉంటాయి. దీనిలో ఉండే అల్లిసిన్ అనే సమ్మేషనం రక్త నాళాలను వేరువేరుగా చేసి వాటిలో రక్త ప్రవాహం సజావుగా జరిగేలా చేస్తుంది. ఇది రక్త నాళాల్లో రక్తం గడ్డకట్టే ప్రమాదాన్నీ అరికడుతుంది. హై బీపీ ఉన్న వారు వెల్లుల్లిని రోజు వారీ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఫలితం ఉంటుంది.