»Actress Renu Desai Fires On Meme Pages On Trolling Her Children Akira Nandan And Aadhya
Renu Desai : నా కూతురు ఏడుపు మీకు తగలుతుంది : రేణూదేశాయ్
తనపై అభ్యంతరకరంగా మీమ్స్ క్రియేట్ చేసిన మీమర్లపై రేణూ దేశాయ్ మండిపడ్డారు. పవన్ కళ్యాణ్‌తో తన పిల్లలు ఉన్న ఫోటోను పోస్ట్ చేస్తూ ఆమె ఈ విషయమై ఏమన్నారంటే..?
Renu Desai : సోషల్ మీడియాలో తనను అవమాన పరిచేలా ఉన్న మీమ్స్‌పై నటి రేణూ దేశాయ్(Renu Desai) స్పందించారు. మీమర్లపై మండిపడ్డారు. అవమానకరంగా మీమ్స్‌ని చేసిన వారిపై ఆమె ఇన్‌స్టాగ్రాంలో ఓ పోస్ట్ పెట్టారు. తన కూతురు తనపై వచ్చిన మీమ్స్‌ని చూసి ఎంతో ఏడ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. భయంకరమైన వ్యక్తులారా మీకూ ఓ కుటుంబం ఉందని గుర్తుంచుకోమంటూ ఆమె చురకలు అంటించారు. మీ తల్లిని అవమానించేలా ఇన్‌స్టాలో పోస్ట్ కనిపిస్తే మీరు ఎలా స్పందిస్తారని ప్రశ్నించారు.
సోషల్ మీడియాల్లో ఇలాంటి అకౌంట్లను మెయింటెన్ చేసే విచక్షణ లేని వ్యక్తులను చూస్తే తనకు ఎంతో అసహ్యంగా(Fire) ఉందని చెప్పారు. తనపై వచ్చిన మీమ్లను చూసి తన కుమార్తె ఎంత బాధ పడిందో తనకు మాత్రమే తెలుసని అన్నారు. ఆ రోజు ఆమె అనుభవించిన బాధ ఊరికే పోదని అన్నారు. ఆమె కన్నీళ్లు కర్మ రూపంలో వారిని వెంటాడతాయని చెప్పుకొచ్చారు. ఈ తల్లి శాపం కచ్చితంగా మీకు తగులుతుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి అకౌంట్లను మెయింటెన్ చేస్తూ కంటెంట్ చేసే వారు చాలా భయంకరమైన వ్యక్తులు అంటూ చెప్పుకొచ్చారు.
ఈ పోస్ట్ చేయడానికి ముందు ఒకటికి వంద సార్లు తాను ఆలోచించాని రేణూ దేశాయ్(Renu Desai) అన్నారు. అయితే నా కుమార్తె అనుభవించిన బాధను, కన్నీళ్లను దృష్టిలో పెట్టుకుని ఈ పోస్ట్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఏపీ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పవన్ కళ్యాణ్, ఆయన సతీమణి అనా లెజినోవాలతో తన కూతురు, కొడుకు.. ఆద్య, అకీరా నందన్‌లు(Aadhya, Akira Nandan) ఉన్న ఫోటోను పంచుకున్నారు. ఇదెంతో క్యూట్ ఫోటో అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.