సత్యసాయి: సోమందేపల్లి మండలం నడింపల్లి పరిసరాల్లో బాబయ్య దర్గా భూములు 500 ఎకరాలు ఉంది. ఈ భూముల్లో ఎర్రమట్టి ఉండడంతో కొందరు మట్టిని త్రవ్వుకుని అమ్ముకుంటున్నారు. దీనిపై సామాజిక వేత్త నడింపల్లి బాబు ప్రసాద్ మంగళవారం స్పంచించారు. దర్గా భూముల్లో మట్టి దొంగతనం కాకూడదని కొన్ని చోట్ల సొంత నిధులతో JCBతో అక్రమ మార్గాలు మూసివేయించారు.