ADB: ఆశా కార్యకర్తల సమస్యల పరిష్కారానికి ఉద్యమించాలని CITU జిల్లా కార్యదర్శి అన్నమొల్ల కిరణ్ అన్నారు. పట్టణంలోని CITU జిల్లా కార్యాలయంలో ఆశా యూనియన్ నిర్మాణ మహాసభలో మంగళవారం ఆయన మాట్లాడారు. ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆశా వర్కర్ల పట్ల తీవ్రమైన వివక్షతను ప్రదర్శిస్తున్నాయని విమర్శించారు.