MNCL: కన్నెపల్లి, భీమిని మండలాల అభివృద్ధికి సింగరేణి నిధులు మంజూరు చేయాలని మాజీ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ నర్సింగారావు కోరారు. ఎమ్మెల్యే వినోద్‌తో కలిసి సింగరేణి C&MD బలరాంకు మంగళవారం వినతిపత్రం అందజేశారు. మండలాలకు నూతన రోడ్లు, బోర్ వెల్స్, సోలార్ విద్యుత్ లైట్ల ఏర్పాటుకు నిధులు కేటాయించాలన్నారు. త్వరలో నిధులు మంజూరు చేస్తానని C&MD తెలిపారు.