NDL: రైతులు రసాయనిక ఎరువుల వాడకం తగ్గించి నేల ఆరోగ్యం పెంచాలని యాగంటి పల్లె కృషి విజ్ఞాన్ కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త ధనలక్ష్మీ రైతులకు సూచించారు. ఇవాళ వెలుగోడు లోని కృషి విజ్ఞాన కేంద్రంలో ఏవో స్వాతి ఆధ్వర్యంలో పంటలపై రైతులకు అవగాహన కల్పించారు. భూసార ఆధారిత ఎరువుల యాజమాన్యం జీవ పద్ధతులపై ప్రస్తుతం పంటల్లో చేయాల్సిన ఎరువుల మోతాదును వివరించారు.